A Thread On @Pauocohelho మతగ్రంథాల తరువాత అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల రచయిత


twitter thread from




A thread on @PauoCohelho
మతగ్రంథాల తరువాత అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల రచయిత గురించి కొన్ని విశేషాలు. ఆయన రచనల్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకం “ది అల్కెమిస్ట్”
1/n
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎన్నాళ్ళయింది అని అడిగినా ఈ రచయితా వయస్సు యెంత అన్నా సమాధానం ఒక్కటే! 24 ఆగస్టు 1947 లో జననం
తల్లి పేరు లైగియా తండ్రి పెడ్రో. మధ్యతరగతి కుటుంబం. పెడ్రో ఒక ఇంజినీరు.
2/n
తల పెద్దగా ఉండటం వల్ల ఫోరెసెప్స్ తో బిడ్డని లాగ వలసి వచ్చింది. కదలిక లేని బిడ్డని చూసి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. కానీ ఊహించని విధంగా బిడ్డ కదిలేసరికి ఇది భగవత్కృప అని తల్లి నమ్మింది.
3/n
బాగా చదివి తనలాగా ఇంజనీర్ కావాలని ఆశించిన తండ్రి కోరికకు ఆశాభంగం కలిగింది. చదువంటే ఏ మాత్రం శ్రద్ద ఉండేది కాదు.
13 ఏళ్ళ వయసులో డైరీ వ్రాయటం మొదలుపెట్టాడు. మనసులో కదిలిన అన్ని భావాలు, కోరికలు, బాధ, సంతోషం అంతా డైరీతోనే!
4/n
ఆస్తమా తీవ్రంగా ఇబ్బంది పెట్టేది. పైగా మనసు యే మాత్రం అలజడికి గురయినా పానిక్ అటాక్స్ వచ్చేవి! శారీరకంగా చాలా దుర్బలుడు
సన్నటి కాళ్ళు చేతులు ఏ మాత్రం సాపేక్షత లేని పెద్ద తలకాయ! చాలా అసహ్యంగా ఉంటానని తన అభిప్రాయం.
5/n
ఆత్మన్యూనతా భావాన్ని కప్పిపుచ్చుకొని అమ్మాయిలని ఆకర్షించటం కోసం కవితలు వ్రాయటం, బ్లాక్ మేజిక్ తాలూకు విద్యలు ప్రదర్శించటం చేసేవాడు.
6/n
అన్ని పెద్ద స్కూల్స్ వద్దన్నాక లేదా గెంటేశాక గత్యంతరం లేక ఒక చిన్న స్థాయి స్కూల్ లో చేరిపోయాడు. చదువు తప్ప ఇతర వ్యాపకాలు బాగా ఆకర్షించేవి. స్కూల్ లో ఇంకా బయటా డ్రామా గ్రూపులతో తిరిగేవాడు.
7/n
మాదకద్రవ్యాలు ఇంకా స్వలింగసంపర్కులు ఇలాంటి గ్రూపుల్లో ఉంటారనే భావనతో తల్లి చాలా కంగారు పడి అలాంటి వారితో తిరగొద్దని మందలించేది.
తల్లితండ్రులు పాలోని మూడుసార్లు పిచ్చాసుపత్రిలో చేర్చారు. అనేకసార్లు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చారు.
8/n
డబ్బు కోసం, చిన్న పత్రికలో కలెక్షన్ బోయ్ గా, కాపీ రైటర్ గా, నాటకాల మధ్యలో జనాలని కుర్చోపెట్టడానికి కామెడీ నటుడిగా, పాటల రచయితా గా, ఫిలిప్స్ కంపెనీ లో క్రియేటివ్ డైరెక్టర్గా ఇంకా పబ్లిషర్ గా అనేక అవతారాలు ఎత్తాడు.
9/n
ఇష్టం కొద్దో ఎలా ఉంటుందో అనే కుతూహలం కొద్దో ఇవీ అవీ అనే తారతమ్యం లేకుండా రుచి చూడని మత్తుపదార్థం లేదు.
10/n
అమ్మాయిలు పాలోతో గడపడానికి ఇష్టపడేవారు. ఒక అమ్మాయిని ప్రేమించినా శృంగారం ఒకమ్మాయితో సరిపెట్టలేదు. వేశ్యలు, నాటకాల గ్రూప్లో పనిచేసిన అమ్మాయిలు, మర్దన చేసేవారు, ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన పాత్రికేయులను, ఒక్కసారి పరిచయమయి మళ్ళీ ఇంకెప్పుడు కలుసుకోని వారు. ఇది ఆగిపోని చిట్టా
11/n
బ్రెజిల్ లోని సైనిక ప్రభుత్వం పాలోని వారంపాటు జైల్లో పెట్టి హింసించింది. తన గర్ల్ ఫ్రెండ్ కున్న లెఫ్టిస్టు మూలాలు దానికి కారణం.
12/n
రామ్ (RAM) అనే ఒక మతపరమైన సంస్థ లో చేరి అనేక తీర్థయాత్రలు చేశాడు.
రచయిత అవ్వాలని బలమైన కోరికున్నా ఎప్పుడు సావధానంగా ప్రయత్నం చేయలేదు. డైరీ వ్రాయటం మాత్రం ఎప్పుడు ఆపలేదు.
13/n
మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరిక ఉన్నా కుటుంబం కోసం ఉద్యోగంలో స్థిరపడ్డ ఒక చిన్ననాటి స్నేహితుడి పరిచయం పాలో ఆర్ధిక కష్టాలను శాశ్వతంగా దూరం చేసింది.
Raul Seixas అనే మిత్రుడు మ్యూజిక్ ఆల్బం చేద్దాం అని పాలో ని పాటలు వ్రాయవలసినదిగా కోరాడు. మొదటి ఆల్బం ఫరవాలేదనిపించింది.
14/n
అనేక మత గ్రంథాలు చదివిన పాలో భగవద్గీత ప్రేరణ తో కొన్ని పాటలు వ్రాసి “GITA” అనే పేరుతొ రెండో ఆల్బం విడుదల చేశారు. ఆ ఆల్బం సంచలన విజయం సాధించటంతో సొంతంగా అపార్ట్మెంట్ కొన్నాడు.
15/n
క్రిస్టినా అనే ఒక ఆర్టిస్టు కం అర్చిటెక్టు పరిచయం వరకు పుస్తక రచయితగా మారాలన్న ఆలోచన కార్యరూపం దాల్చలేదు. తన ప్రోద్బలంతో మొదటి పుస్తకం “ది పిలిగ్రిమేజ్” ప్రచురించారు. అమ్మకాలు బాగా జరిగినా బ్రెజిల్లో విమర్శకులు తీవ్రంగా స్పందించారు. సాహిత్యానికి పట్టిన చీడ పాలో అని వ్రాసారు
16/n
తీర్థయాత్రలో భాగంగా ఈజిప్ట్ వెళ్ళాడు. అక్కడ గిజా పిరమిడ్ వద్ద ఎడారి నుండి ఒక మహిళ కుడి భుజం మీద ఒక నీళ్ల కుండతో మొహానికి సగం కప్పిన ముసుగుతో తన వద్దకి వచ్చి అంతర్ధానం అయ్యింది.
17/n
అప్పటికే తెలిసి ఉన్న ఒక స్పానిష్ జానపద కధకి ఈ అనుభవాన్ని జోడించి వ్రాసిన పుస్తకమే “ది అల్కెమిస్ట్” అప్పటికి ఆయన వయసు 40 ఏళ్ళు
18/n
ఈ పుస్తకం అమ్మకాలు బ్రెజిల్లో బాగా జరిగినా ఫ్రెంచ్ భాషలోకి తర్జుమా అయ్యేవరకు “ది అల్కెమిస్ట్” ప్రపంచ ప్రఖ్యాతి పొందలేదు. స్వదేశంకంటే ఫ్రాన్స్ లో ఆయనకి లభించిన గౌరవానికి గుర్తుగా అక్కడ ఒక ఇల్లు కొన్నాడు.
19/n
అనేక మంది దేశాధినేతలు పాలోని కలవటానికి తహ తహ లాడారు. ముఖ్యంగా బిల్ క్లింటన్, జాక్వెస్ చిరాక్, పుతిన్ తదితరులు. బ్రెజిల్ దేశాధ్యక్షుడు తన 70 మంది బలగంతో బకింగం పాలస్లో రాణిని కలిశారు. డ్రెస్ కోడ్ ప్రకారం తాము రాలేమని బ్రెజిల్ దేశాధ్యక్షుడు తెలుపడంతో వారికి మినహాయింపు ఇచ్చారు.
రచయిత పాలో కి కూడా ఆహ్వానం అందింది. ఏ డ్రెస్ లో రావాలని పాలో పాలెస్ అధికారులని సంప్రదించాడు. “యు అర్ నాట్ ది గెస్ట్ అఫ్ యువర్ ప్రెసిడెంట్ బట్ ది గెస్ట్ అఫ్ ది క్వీన్” అనే ప్రత్యుత్తరం అందింది.
21/n
ఇప్పటి వరకు ఆయన రచనలు అన్నీ కలిపి 100 మిలియన్ల కాపీలు అమ్ముడు పోయాయి. అనేక విదేశీ భాషల్లోకి అనువాదం జరిగింది. ఆయన మాత్రం తన రచనలన్నీ మాతృ భాష అయిన పోర్చుగీసు లోనే వ్రాస్తారు.
22/22

Leave a Reply

Your email address will not be published.